
తిరుమలాయపాలెం, జూలై 19( నమస్తే న్యూస్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ యల్మారెడ్డి నరేందర్ రెడ్డి అమెరికాలోని తన నివాసాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు సీతక్క.ఈ సందర్భంగా యల్మారెడ్డి నరేందర్ రెడ్డి మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అమెరికాలో ప్రవాస భారతీయుల సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మంత్రి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు.
