ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమీక్ష సమావేశానికి తరలిరావాలని టీయూఎఫ్ పిలుపు.

మహబూబాబాద్, జూలై 19 (నమస్తే న్యూస్): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) ఆధ్వర్యంలో సోమవారం (జూలై 20) ఉదయం 9 గంటలకు మహబూబాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమకారిణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు. ర్యాలీ అనంతరం అమరవీరుల స్మారక భవన్లో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, ఉద్యమకారులకు గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లుగా నిరంతర పోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు.ఉద్యమకారుల ఐక్యతే తమ బలమని, హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు.
