జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది.
-జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్.
సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
-జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్.

నర్సింహులపేట,జులై 17(నమస్తే న్యూస్)జర్నలిస్టుల సంక్షేమ హక్కుల పరిరక్షణ కోసం టియూడబ్ల్యూజే(ఐజేయు) నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మండల ప్రధాన కార్యదర్శి కోల యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని వారు అన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి జర్నలిస్ట్ సంఘం స తీసుకొని ఐక్యతగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గంధసిరి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మగాని మధు, జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్, మండల సంఘం నాయకులు మరియు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
