దంట్లకుంట తండ సర్పంచ్ గుగులోత్ అరుణ సోమా నాయక్
తండలో 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు ప్రారంభం.

మరిపెడ ,జులై 13(నమస్తే న్యూస్)
తండా ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని దంట్లకుంట తండ సర్పంచ్ గుగులోత్ అరుణ సోమా నాయక్ అన్నారు.మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం దంట్లకుంట తండ గ్రామపంచాయతీలో 10 లక్షల రూపాయల నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్డును తండా సర్పంచ్ గుగులోత్ అరుణ సోమా నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ..గ్రామపంచాయతీలోని అన్ని వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని,ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించకుండా సీసీ రోడ్లను నిర్మిస్తామని తెలిపారు.తండా ప్రజల సౌకర్యార్థం గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీరు ఇంటింటికి అందిస్తామని,అలాగే సైడ్ డ్రైనేజ్ కాలువల నిర్మాణం చేపడతామన్నారు.ప్రభుత్వం అందజేసే సంక్షేమ,అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్క మా గ్రామ పంచాయితీ ప్రజలకు చేర్చే విధంగా ఎల్లప్పుడు గ్రామ(తండ)ప్రజలకు సహాయ సహకారాలు అందచేస్తామని,గ్రామ ప్రజల సహాకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని,పంచాయితీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లు,తండా నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
