ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలు.
200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలి.
ఏఐపీకే ఎంఎస్ కార్యదర్శి బందెల వెంకయ్య.

తిరుమలాయపాలెం,జూలై 15 (నమస్తే న్యూస్)
భారతదేశంలో తినడానికి తిండి లేక చేసుకోవడానికి పని దొరకక ఎందరో ఉపాధి కోసం వలసలు పోతున్న తరుణంలో 2005 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీస్కో వచ్చి వందరోజుల పని దినాలు కల్పించిన జాబ్ కార్డులు ఇచ్చిన భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని గత 12 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానిగా భారతదేశంలో పరిపాలిస్తున్న. బిజెపి అధికారంలోకి వచ్చిన కానుండి ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడం కోసం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ క్రమక్రమంగా పని దినాలను తగ్గించి ఉపాధి కూలీలకు పని లేకుండా చేస్తున్న పరిస్థితి ఈరోజు భారతదేశంలో కొనసాగుతుందని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ( ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకయ్య అన్నారు.
ఈరోజు పిండిప్రోలు గ్రామంలో రాయల వెంకటనారాయణ భవనంలో ఏఐపీకేఎంఎస్ పాలేరు డివిజన్ అధ్యక్షుడు సోమనపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం జరిగిన పాలేరు డివిజన్ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీలో బందెల వెంకయ్య పాల్గొని పై విధంగా అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నూతనంగా జి రామ్ జి పథకాన్ని తీసుకురావడం కార్పొరేట్ శక్తులకు అప్పగించటం కోసమేనని అన్నారు.100 నుండి 125 రోజులకు పని దినాలను పెంచనమని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ నిధులు ఎందుకు కేటాయించలేదని ఆయన అన్నారు.200 రోజులు పని దినాలు కల్పించి ఎలాంటి కొలతలు లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని,పని ప్రదేశంలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించాలని. వి బి జి రాంజీ పథకాన్ని రద్దుచేసి వెంటనే మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలో అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు రేపాకుల శివలింగం. ఏఐపీకే ఎంఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు. పాలేరు డివిజన్ కార్యదర్శి రెంటాల యాదగిరి. డివిజన్ నాయకులు పోలే పొంగు ఉప్పలయ్య. రాయబారపు యోహాన్. రాథోడ్ భూక్య మచ్చు నాయక్. తోకల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
