రామన్నపేట సెప్టెంబర్ 25(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో మహాత్మ యూత్ ఆధ్వర్యంలో కచీర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి గణనాధుని నిమజ్జనం ఉత్సవాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గోశిక వెంకటేశ్వర్లు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి,నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్నారు, గోశిక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాధుని వేడుకున్నట్లు తెలిపారు, అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాత్మ యూత్, బజరంగ్ యూత్ లకు గణనాధుని విగ్రహాలను బహూకరించడం జరిగింది, గ్రామంలోని మరి కొంతమంది యూత్ సంఘాలకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది, అలాగే భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకు,యువతకు తన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చెరుకు రాజు, కడారి లక్ష్మణ్,కునూరు శ్రీకాంత్, తెలుసూరి నవీన్, కునూరు రాంబాబు,జెల్ల వరప్రసాద్, రాపోలు అశోక్, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
