డీజే చప్పుళ్లు.. కోలాట నృత్యాలు.. యువత కేరింతలు
భక్తిశ్రద్ధల మధ్య విఘ్నేశ్వరునికి ఘనంగా వీడ్కోలు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 25 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని పిండిప్రోలు లో ఓం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని నిమజ్జన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే చప్పుళ్లు, కోలాట నృత్యాలు, యువత కేరింతలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఊరేగింపు మార్మోగింది. భక్తుల సందడి మధ్య విఘ్నేశ్వరుని నిమజ్జనం భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో ఓం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కట్టొజు బ్రహ్మచారి కట్టొజు వెంకటాచారి కట్టొజు ఉపేంద్ర చారి వడ్లమూడి వినయ్ కుమార్ కొత్త శ్రీనివాస్ కట్టొజు మోహనా చారి కట్టొజు హర్షవర్ధన చారి కొత్త సివెంద్ర తదితరులు పాల్గొన్నారు
ఓం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
