విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ,ఫ్యాన్లు,షటిల్ పోల్స్ అందజేత.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
కందికొండ గ్రామ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాంలు,షూస్,టై,బెల్టులను ఎమ్మెల్యే ఆదేశాలు,ఉపాధ్యాయుల పిలుపు మేరకు సర్పంచ్ తుడుసు నాగార్జున విద్యార్థులకు అందజేశారు.అనంతరం తాను ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలకు ఫ్యాన్లను అందించారు.పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని,ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని సూచించారు.విద్యార్థులు ఆడుకోవడం కోసం పాఠశాల గ్రౌండ్ లో షటిల్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన పోల్స్ ను కూడా అందించి,విద్యార్థులతో కాసేపు సరదాగా షటిల్ ఆడారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్,వార్డు సభ్యులు అంబడిపూడి ఇసాకర్,తోట మహేష్,తుడుసు అనిత,మెట్టు ఉప్పలయ్య,మాజీ సర్పంచ్ హేమలత,యూత్ అధ్యక్షుడు మాచర్ల వెంకటేష్,పార్టీ నాయకులు సుశాంత్,బిక్షపతి,అల్వాల నవీన్ తదితరులు పాల్గొన్నారు..
