ఎంపీడీవో షేక్ సిలర్ సాహెబ్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 26 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం కేజీబీవీ లో అసిస్టెంట్ కుక్కు ఉద్యోగం
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగ వివరాలు పోస్టు అసిస్టెంట్ కుక్కు
ఖాళీలు: 01అర్హత: కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత వేతనం: నెలకు రూ.9,750 వయస్సు: 01-09-2026 నాటికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. పని ప్రదేశం: కేజీబీవీ , తిరుమలాయపాలెం ఎంపిక విధానం: మండల విద్యాశాఖాధికారి ( ఎం ఈ ఓ ), తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడీవో) సభ్యులుగా ఉన్న సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. విద్యార్హతలు, వయస్సు, ఇతర అర్హతలను పరిశీలించిన అనంతరం మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తుల సమర్పణ: అర్హత కలిగిన అభ్యర్థులు 28-09-2026 నుంచి 03-10-2026 వరకు తిరుమలాయపాలెం మండల విద్యాశాఖాధికారి ( ఎంఈఓ ) కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలి. 06-10-2026 ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ (ఎంపీడీఓ ) కార్యాలయం, తిరుమలాయపాలెం నందు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ ప్రకటనలో తెలిపారు.
