పాఠశాల రికార్డులు,వంటశాల,సామాగ్రి నిల్వ పరిశీలన.
మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
నమస్తే న్యూస్/మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డితో కలిసి పాఠశాలలోని రికార్డులను, వంటశాలను, సామాగ్రి నిల్వలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాల పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు రాము,పానుగోతు రాములు, కోఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న,4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ పాషా,బయ్య లింగన్న,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాలు,వార్డెన్ రమేష్,కృష్ణ,మోతీలాల్,జయలక్ష్మి,వార్డు అధికారి పాషా తదితరులు పాల్గొన్నారు..


