అధ్యక్షుడిగా కొండ్రు రామచంద్రుడు.. ప్రధాన కార్యదర్శిగా సోంపోగు శ్యామ్ సుందర్ ఎన్నిక
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 26 (నమస్తే న్యూస్ )
ఖమ్మం జిల్లా నూతన స్వీరోస్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కొండ్రు రామచంద్రుడు, ప్రధాన కార్యదర్శిగా సోంపోగు శ్యామ్ సుందర్ ఎన్నికయ్యారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య హాజరై మాట్లాడుతూ.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఖమ్మం జిల్లా మాజీ సీనియర్ స్వీరోస్ నాయకులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డాక్టర్ పి.సి. వీరస్వామి , రమేష్ , కోటి, జములమూడి జగదీష్ , ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాగరాజు , మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.ఈ కమిటీ ద్వారా జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో స్వీరోస్ కార్యకర్తలను సమన్వయం చేసుకుని సంఘం అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఇంచార్జి చిలకబత్తిని వీరయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎన్నిక విజయవంతంగా జరిగింది.
