కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్,మాజీ మంత్రి.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,(సెప్టెంబ 26):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఒంటికొమ్ము అప్పారెడ్డి,ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒంటికొమ్ము వెంకటరెడ్డిల మాతృమూర్తి ఒంటికొమ్ము సుశీలమ్మ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు.ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.శనివారం స్వగ్రామం అబ్బాయిపాలెంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు,గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోత్ రామచంద్రు నాయక్,మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి సుశీలమ్మ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం కుమారులు అప్పారెడ్డి,వెంకటరెడ్డిలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సుశీలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుతరావు,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రామ్ లాల్,గ్రామ పెద్దలు ఒంటికొమ్ము రామచంద్రారెడ్డి,ప్రభాకర్ రెడ్డి,తల్లాడ వెంకట రామారావు,సత్యనారాయణ రెడ్డి,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు..

