తప్పుడు ప్రచారాలు మానుకోవాలి…
బాబోజీగూడెం సలవాది పాండు.
డోర్నకల్ /మరిపెడ ఆగష్టు 22(నమస్తే న్యూస్).
మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బయ్య పాలెం గ్రామపంచాయతీలో సాయి అక్షిత గ్రీన్ సిటీ వెంచర్ లో ఏజెంట్లుగా గంట శ్రీను,విజయ్ టీంలో ఐదు సంవత్సరాలుగా పనిచేశానని సలవాది పాండు తన ఆవేదన వ్యక్తం చేశారు.ఆ వ్యాపారంలో నాకు రావలసిన 20 లక్షల రూపాయలను ఇవ్వకుండా,ఇబ్బందులకు గురిచేస్తున్నారు.నా డబ్బులు అడిగినందుకు వారు నన్ను బెదిరింపులకు గురి చేస్తూ,నాపై లేనిపోని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నా కష్టారజీతాన్ని అడిగినందుకుగాను నాపై కక్ష పూర్వితంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని ఆపకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు…
