రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, వి, కోటేశ్వరరావు పిలుపు,
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 26 (నమస్తే న్యూస్ )
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా వి, కోటేశ్వరావు మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభ స్థితిని ఎదుర్కొంటుందని దీనంతటికీ కారణం భారత పాలకవర్గాలు అనుసరిస్తున్న రైతంగ వ్యతిరేక విధానాలు, సరళీకరణ ఆర్థిక విధానాలే కారణమని ఆయన అన్నారు, భారత ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ పోరాటాల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కార్యచరణ ఇంతవరకు చేపట్టకపోవడం రైతన్న ఎడల వారికున్న సిద్ధ శుద్ధి తెలియజేస్తుంది, అనేక సామ్రాజ్యవాద దేశాలతో పాలకవర్గాలు చేసుకుంటున్న అసమాన ఒప్పందాలు మూలంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావట్లేదని, లేదా కనీసం మద్దతు ధర రావట్లేదు దీనంతటికీ కారణం భారత ప్రభుత్వం, 32 దేశాలతో కుదిరించుకున్న ఒప్పందాలు, ముఖ్యంగా అమెరికాతో కుదిరించుకున్న ఒప్పందాలు, రైతంగానికి గుదిబండగా మారబోతున్నాయి తక్షణం ఈ అసమాన ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, బహుళ జాతి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విత్తనాలు వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది నకిలీ విత్తనాలు, అవే కాకుండా పర్మిషన్ లేకుండా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది దీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, రాబోయే మహాసభల్లో భారత రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని బలమైన రైతు కూలీ ఉద్యమాన్ని నిర్మించి పాలకుల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రకాష్, వెంకటరామిరెడ్డి మందుల రాజేంద్రప్రసాద్, గిరి షేక్ కాశీం, సుదర్శన్,, పరకాల లక్ష్మి జానకి మోహన్ రావు సంగక్క మాధవరావు తదితరులు పాల్గొన్నారు

