మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వార్డు కమిటీ ఎంపికల సమావేశాలు.
2వ వార్డు అధ్యక్షుడిగా బానోత్ శతృ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 21(నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వార్డు కమిటీల నిర్మాణంలో భాగంగా నిర్వహించిన ఎన్నికల సమావేశాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నాడు.
ఈ సమావేశంలో 2వ వార్డు అధ్యక్షుడిగా బానోత్ శతృ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని,వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వీసారపు శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చాడు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్,డి సి సి సభ్యుడు కుడితి నరసింహరెడ్డి,అలువాల ఉపేందర్ ప్రజాపతి,గంధసిరి భిక్షపతి,సయ్యద్ సర్వర్,నరేష్,కస్నా నాయక్,వీరన్న,బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు…
