భక్తి పారవశ్యంలో మునిగిపోయిన రాజోలు ప్రజలు.
కురవి, ఆగస్టు 31 (నమస్తే న్యూస్): కురవి మండలం రాజోలు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శివాలయానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. రాజోలు గ్రామంలో నూతన శివాలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమైన విషయమన్నారు. శివాలయం గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని కోరుకున్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొల్లపల్లి రజనీకాంత్, జిల్లా కోశాధికారి గార్లపాటి వెంకట్ రెడ్డి, రాజోలు సర్పంచ్ బానోత్ మంగమ్మ–దేవేందర్, ఉప సర్పంచ్ కొక్కు శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోప నాయక్, మండల, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


