filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;
మరిపెడ,ఆగస్టు 20(నమస్తే న్యూస్ ).
పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధాని,భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.ఆధునిక భారత నిర్మాణంలో,పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం,యువతకు ఓటు హక్కు కల్పనలో రాజీవ్ గాంధీ పాత్ర చిరస్మరణీయమని అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్,టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్,కే సముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,డీసీసీ సభ్యుడు కుడితి నర్సింహా రెడ్డి,కౌన్సిలర్లు జాటోత్ సురేష్,మెరుగు రాము,జియో రమేష్,నీలా లచ్చిరామ్,కాంతమ్మ కరణ్ సింగ్,పానుగోతు రాములు,కో-ఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్న,షేక్ సలీమా తాజోద్దీన్,సర్పంచులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,తొట్టి గౌతమ్,బద్రు,నరేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు,సీనియర్ నాయకులు,యువజన నాయకులు,మహిళా నాయకురాళ్లు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
