29 డిమాండ్లతో తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేత.
పీఆర్సీ అమలు,సీపీఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్.
డోర్నకల్/మరిపెడ,ఆగష్టు 13(నమస్తే న్యూస్):
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మరిపెడ శాఖ ఆధ్వర్యంలో గురువారం దశలవారీ ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా మరిపెడ మండల నాయబ్ తహసిల్దార్ డి.మాల్యాకు మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని,వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ముఖ్యంగా కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని,పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని,సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.మోడల్ స్కూల్స్,ఎయిడెడ్ స్కూల్స్,గురుకులాల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని,గురుకుల పాఠశాలల టైం టేబుల్‌ను శాస్త్రీయంగా సవరించి విద్యార్థులకు,ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్పులు చేయాలని,విద్యారంగంలో స్వచ్ఛంద సంస్థల జోక్యాన్ని నివారించాలని కోరారు.మొత్తం 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్‌కు అందజేసి,డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ తరపున టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి,యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జనార్ధనాచారి,యూటీఎఫ్ మండల బాధ్యులు ప్రభాకర్ రావు,గోవర్ధన్,నెహ్రు,దేవులా మంగు,కళ్యాణి,సోమ్లా మురళీకృష్ణ,లాల్ చంద్,టీపీటీఎఫ్ మండల బాధ్యులు హఫీజర్,పవన్,రవి,రవీంద్ర కుమార్,మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు.

