రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట _గంధం పల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలోనీ రామాలయం దగ్గర భూక్య వసంత నరేష్ మహా అన్న ప్రసాద వితరణ దాత ..మహాగణపతి ఉత్సవాల భాగంగా గణపతి మండపం దగ్గర ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి,విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణపతి శ్రీ బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడిని దర్శించుకొని,కొబ్బరికాయ కొట్టి,ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారి ఆశీస్సులను పొందారు.శ్రీ బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…మట్టి గణపతిని ఏర్పాటు చేసి మహా అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు సుమారు 1000 మంది పాల్గొని ఉంటారని తెలియజేశారు,వినాయక చవితి పర్వదినం ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తిని పెంపొందించాలని ఆకాంక్షించారు..ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, అభివృద్ధి వెల్లివిరియాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు..ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించాలి.ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి అని తెలిపారు.గణనాథుడి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,పాడిపంటలతో సుఖ సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ సభ్యులు ,యూత్ సభ్యులు , వివిధ గ్రామాల భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

