Type Here to Get Search Results !

మరిపెడ 4వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్ పర్సన్.

మరిపెడ 4వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్ పర్సన్.


కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ(జూలై 01)నమస్తే న్యూస్.మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో గల పోలీస్ స్టేషన్ గల్లీలో బుధవారం కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె వీధుల్లో పేరుకుపోయిన చెత్త,కాలువల్లో పూడికతీత పనులను స్వయంగా పర్యవేక్షించారు.పారిశుధ్య సిబ్బందితో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలం నేపథ్యంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.పట్టణంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,ప్రజలందరూ సహకరించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఛైర్ పర్సన్ కోరారు.పారిశుధ్యంపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఛైర్ పర్సన్ వెంట 4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,నాయకులు గుంటి రవి,మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.