ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బంధు యాకయ్య.
ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు లావుడియా రాములు నాయక్.
డోర్నకల్/మరిపెడ,జూన్ 16(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన బంధు యాకయ్య తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లావుడియా రాములు నాయక్ ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన,గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేసే లక్ష్యంతో బంధు యాకయ్యను రాష్ట్ర కమిటీలోకి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.యాకయ్య పదవీకాలం ఐదేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన ఉపాధ్యక్షులు బంధు యాకయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌ల సంక్షేమం,వారి సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.బంధు యాకయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల రాంపురం గ్రామ ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధులు,సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు.

