- రెండు చుక్కలు..చిన్నారుల ఆరోగ్యానికి జీవితకాల భరోసా సర్పంచ్ పెదమాముల యాకయ్య.
- పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు.
- రెండు చుక్కలు..చిన్నారుల ఆరోగ్యానికి జీవితకాల భరోసా సర్పంచ్ పెదమాముల యాకయ్య.
- పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు.
![]() |
| పోలియో చుక్కలను వేస్తున్న డీపీఓ పుల్లారావు. |
నర్సింహులపేట, జూన్ 28 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని డీపీఓ పుల్లారావు, ఎంపీడీవో రాంప్రసాద్, వైద్యురాలు డాక్టర్ కవిత, గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య సంయుక్తంగా ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దమాముల యాకయ్య మాట్లాడుతూ, "రెండు చుక్కలు మీ బిడ్డల జీవితానికి నిండు నూరేళ్ల పోలియో రహిత భరోసా" అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు జననం నుంచి ఐదేళ్లలోపు వయస్సు గల చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.డీపీఓ పుల్లారావు, ఎంపీడీవో రాంప్రసాద్, డాక్టర్ కవిత మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలందరూ సహకరించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాస యాకయ్య, పంచాయతీ సెక్రటరీ అశోక్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం ప్రసన్నకుమారి, హెచ్ వి సుజాత, ఎం ఎల్ హెచ్ పి అన్వేష్,ఆశాలు జ్యోతి ,వెంకటలక్ష్మి అంగన్వాడి టీచర్ సరోజన,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


