- టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ ఉక్కుల అశోక్‌కు ఘన సన్మానం.
- శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ బి గ్రేడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ ఉక్కుల అశోక్‌ను పలువురు వైద్య ప్రముఖులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ బి గ్రేడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, గడ్డం వెంకట్ రెడ్డి, తదితరులు డాక్టర్ ఉక్కుల అశోక్‌కు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ఉక్కుల అశోక్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం,సమాజానికి మరింత బలం చేకూర్చుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సామాజిక కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

