- దేవాలయాల ప్రతిష్ట మహోత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్.
- పర్కజాల తండ,మల్లమ్మ కుంట తండల్లో ప్రత్యేక పూజలు.
డోర్నకల్/మరిపెడ,జూన్ 20(నమస్తే న్యూస్)మరిపెడ మండలంలో శనివారం జరిగిన పలు దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.నీలికుర్తి పంచాయతీ పర్కజాల తండాలో శ్రీ లక్ష్మి భూలక్ష్మి నాభిశిలా,శీతల పరమేశ్వరి,బొడ్రాయి,శ్రీ అభయాంజనేయ స్వామి స్థిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుడిపుడి శ్రీనివాస రావు,బానోతు కొండయ్య,సైదులు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా చిల్లంచర్ల పంచాయతీ పరిధి మల్లమ్మ కుంట తండలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి,శ్రీ రేణుక ఎల్లమ్మ,శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో రెడ్యా నాయక్ పాల్గొన్నారు.అమ్మవార్లకు,ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి,ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు గాదె రాంబాబు,సీనియర్ నాయకులు గాదే అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.రెండు తండాల్లో జరిగిన మహోత్సవాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ రాకతో గ్రామాల్లో సందడి నెలకొన్నది.



