Type Here to Get Search Results !

ఇద్దరు ఎన్‌ఆర్‌జీఈఎస్ అధికారులు సస్పెండ్.

మరిపెడ మండలంలో అధికారులపై వేటు.
ఇద్దరు ఎన్‌ఆర్‌జీఈఎస్ అధికారులు  సస్పెండ్.



డోర్నకల్/మరిపెడ(జూన్ 18)నమస్తే న్యూస్.

ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ జి ఈ ఎస్) నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో మరిపెడ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు కీలక అధికారులపై వేటు పడింది.ఉపాధి హామీ పథకంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఏపీవో భీమా నాయక్,ఇన్‌ఛార్జ్ ఈసీ భూక్య నెహ్రూ నాయక్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఎ)పీడీ మధుసూదన్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.గత కొంతకాలంగా మరిపెడ మండలంలో ఉపాధి హామీ పనుల్లో నిధులు పక్కదారి పడుతున్నాయని,బిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ప్రాథమికంగా ఆరోపణలు నిజమేనని తేల్చారు.దీంతో వెంటనే చర్యలు తీసుకుంటూ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియచేశారు.ఉపాధి హామీ పథకంయొక్క ప్రభుత్వ లక్ష్యం పేదలకు పని కల్పించడమేనని,నిధుల దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘటనతో మహబూబాబాద్ జిల్లాలోని ఇతర మండలాల్లోని ఉపాధి హామీ అధికారుల్లో కలకలం రేగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.