Type Here to Get Search Results !

నూతన ఎంపీడీవో రాంప్రసాద్‌కు సర్పంచ్, ఉపసర్పంచ్ ఘన సన్మానం.

నూతన ఎంపీడీవో కు సర్పంచ్, ఉపసర్పంచ్ ఘన సన్మానం



నర్సింహులపేట, జూన్ 18 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జి. రాంప్రసాద్‌ను మండలంలోని గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, ఉపసర్పంచ్ కాస యాదయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీవో రాంప్రసాద్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, మండల అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల సమగ్ర ప్రగతికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.అనంతరం ఎంపీడీవో రాంప్రసాద్ మాట్లాడుతూ, మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.