Type Here to Get Search Results !

మరిపెడ పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.

  • మరిపెడ పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.
  • బస్టాండు ఆవరణలో పిక్‌పాకెటర్ అరెస్ట్. 
  • కార్గిల్ సెంటర్గు  లో గుట్కా విక్రయదారులపై కేసు.



డోర్నకల్/మరిపెడ(జూన్ 18)నమస్తే న్యూస్.

మరిపెడ పోలీసులు గురువారం పట్టణంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. 

 బస్టాండ్‌లో పిక్‌పాకెటర్ అరెస్టు.

మరిపెడ బస్టాండ్‌లో ఒక ప్రయాణికుడి ప్యాంటు జేబులో నుండి పదివేల రూపాయలు దొంగిలిస్తుండగా వర్త్య చందునాయక్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.నిందితుడు వర్త్య చందునాయక్ తండ్రి దేవుజ్య నాయక్,38 సంవత్సరాలు,లంబాడా,కూలీ.ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ జంగం మెట్‌లోని రవీందర్ నాయక్ బజార్‌లో నివాసం ఉంటున్నాడు.సొంత ఊరు మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల మండలం దుబ్బ తండ.నిందితుడిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ ఎచ్ ఓ గండ్రాతి సతీష్ మాట్లాడుతూ,బస్టాండ్‌లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని,బస్సు ఎక్కే సమయంలో సెల్‌ఫోన్లు,విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

మైనర్లకు గుట్కా,సిగరెట్లు అమ్మిన ఇద్దరిపై కేసు.

అదేరోజు మరిపెడ అదనపు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సిబ్బందితో కలిసి టౌన్‌లో పెట్రోలింగ్ చేస్తుండగా కార్గిల్ సెంటర్ దగ్గర గవర్నమెంట్ హాస్టల్ సమీపంలోని రెండు పాన్ షాపుల్లో మైనర్ పిల్లలకు గుట్కా,సిగరెట్లు అమ్ముతున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది.వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీ చేయగా,సలీమ్ ఖాన్ తండ్రి కాలుకాన్,40 సంవత్సరాలు,కార్గిల్ సెంటర్,మరిపెడ మరియు కొండ గణేష్ తండ్రి రామకృష్ణ, 31 సంవత్సరాలు,కార్గిల్ సెంటర్,మరిపెడ అనే ఇద్దరు వ్యక్తులు గుట్కా,సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి షాపుల్లో ఉన్న గుట్కా,సిగరెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.మైనర్ పిల్లలకు గుట్కా,సిగరెట్లు,ఇతర నిషేధిత ఉత్ప్రేరకాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఎచ్ ఓ గండ్రాతి సతీష్ హెచ్చరించారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.