- కాలం రవీందర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
- నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి.
డోర్నకల్/మరిపెడ(జూన్ 03)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు,మరిపెడ మున్సిపల్ ఉపాధ్యక్షులు కాలం సునీత రెడ్డి భర్త కాలం రవీందర్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందారు.ప్రస్తుతం ఆయన ఖమ్మంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఖమ్మంలోని కాలం రవీందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అనారోగ్యం నుంచి త్వరగా పూర్తిగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో సాధారణ జీవనంలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.రవీందర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.పార్టీ కార్యకర్తలకు,నాయకులకు ఎప్పుడూ అండగా నిలిచే రవీందర్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరమని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,కొంపల్లి శ్రీధర్ రెడ్డి,యాళ్ల మురళీధర్ రెడ్డి,మన్యు ప్యాట్నీతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొని రవీందర్ రెడ్డిని పరామర్శించారు.

