Type Here to Get Search Results !

ఆరోగ్య కేంద్రంలో షెడ్డు నిర్మించిన దాతలు.

  • ఉప్పల సోమయ్య జ్ఞాపకంగా నలుగురికి నీడ. 
  • 20వ వర్ధంతి సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో షెడ్డు ప్రారంభం.



డోర్నకల్/మరిపెడ(జూన్ 03)నమస్తే న్యూస్

తండ్రి చేసిన మేలును మరువని కుమారులు,ఆయన జ్ఞాపకార్థం సమాజానికి సేవ అందించారు.మరిపెడ పట్టణంలోని సంత ఆవరణలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు,ప్రజల సౌకర్యం కోసం నూతన రేకుల షెడ్డు అందుబాటులోకి వచ్చింది.కీర్తిశేషులు ఉప్పల సోమయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు ఉప్పల వెంకటేశ్వర్లు,కృష్ణమూర్తి,సత్యం,రమేష్‌లు తమ సొంత ఖర్చులతో ఈ షెడ్డును నిర్మించారు.బుధవారం ఆరోగ్య ఉపకేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన షెడ్డును ప్రారంభించారు.

ఎండకు,వానకు రోగులు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఉప్పల కుటుంబీకులు,తమ తండ్రి జ్ఞాపకార్థం శాశ్వతంగా గుర్తుండిపోయే సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ షెడ్డు నిర్మాణంతో వైద్యం కోసం వచ్చే వృద్ధులు,గర్భిణులు,చిన్నారులకు ఎంతగానో ఉపశమనం కలగనుంది.ఈ సందర్భంగా సోమయ్య కుమారులు మాట్లాడుతూ...ఉప్పల సోదరులు తండ్రి పేరుకి జ్ఞాపకార్ధంగా షెడ్డు వేసినామని అన్నారు.మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారని,మనం సంపాధించిన దానిలో కొంతయినా సమాజ సేవకు ఉపయోగించాలని,సమాజ సేవకు మించిన ఎవరు ఇంకొకటి ఉండదని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.ఆయన ఆశయాలను కొనసాగించడం కొడుకులుగా మా భాధ్యత అన్నారు.అనంతరం డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో వచ్చినవారు ఎండలో కూర్చోవడం చూసి చలించిన వారు వారి తండ్రిగారి జ్ఞాపకార్ధం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రేకులు వేసి రోగులకు నీడ కలిపించారని అన్నారు.తండ్రి మీద ఉన్న ప్రేమను,గౌరవాన్ని ఇలా సమాజసేవ రూపంలో చాటుకోవడం అందరికీ ఆదర్శమని అన్నారు.కార్యక్రమంలో వైద్య సిబ్బంది,స్థానిక ప్రజలు,ఉప్పల సోమయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.