Type Here to Get Search Results !

తెలంగాణ మలిదశ ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి:రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య.

తెలంగాణ మలిదశ ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి: 

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య.




నర్సింహులపేట, జూన్ 28 (నమస్తే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి, ఉద్యమానికి ఊపిరి పోసిన మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య డిమాండ్ చేశారు.ఆదివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య, ఎండి కాజామియా ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు కొడంగల్‌కు బయలుదేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, ఇచ్చిన హామీల అమలు ద్వారా తన నిబద్ధతను నిరూపించుకోవాలని అన్నారు.తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ,జిల్లా ముఖ్య సలహాదారుడు ఆకుతోట సాయికృష్ణ,కార్యదర్శి చిర్ర ఉపేందర్,ఉపాధ్యక్షుడు రమేష్, అంబరీష,రేఖ నరసయ్య,కోట వెంకటయ్య తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.