- అమృనాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు
- క్రివి ఫౌండేషన్ రూ.40 వేల విలువైన సామగ్రి పంపిణీ.
డోర్నకల్/మరిపెడ(జూన్ 28)నమస్తే న్యూస్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అమృనాయక తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్రివి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు,విద్యా సామగ్రిని అందజేశారు.కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.40,000 విలువైన వాటర్ ప్యూరిఫైయర్,వైట్ బోర్డు,స్కూల్ బ్యాగులు,స్టేషనరీ సామగ్రిని పాఠశాలకు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో క్రివి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మ రూప్లా నాయక్ వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.వారితో పాటు విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

