దుబ్బాక లక్ష్మారెడ్డి కి నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.
దుబ్బాక లక్ష్మారెడ్డి మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.డోర్నకల్ నియోజకవర్గం,చిన్నగూడూర్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి ఇటీవల మరణించారు.వారి దశదినకర్మ కార్యక్రమం నేడు మరిపెడ బంగ్లాలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై,దివంగత లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,రామసహాయం సత్యనారాయణ రెడ్డి,కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి,నరేష్ రెడ్డి,వల్లూరి చెన్నారెడ్డి,బొడ శ్రీను నాయక్,బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

