మరిపెడ మండలం గిరిపురం గ్రామంలో విషాద ఛాయలు.
డోర్నకల్/మరిపెడ(జూన్ 24)నమస్తే న్యూస్.మరిపెడ మండలం గిరిపురం గ్రామానికి చెందిన పూసల తాండ వాసి బాదావత్ లాలి కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెళ్లి రఘువీరారెడ్డి బాధిత కుటుంబాన్ని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి,వెంకట సాయి,స్థానిక సర్పంచ్ నీలా సైదులు,బహు సింగ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నాయకులు బాదావత్ లాలి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.గ్రామస్తులు కూడా ఈ పరామర్శలో పాల్గొని కుటుంబానికి అండగా నిలిచారు.

