మరిపెడ కేజీబీవీలో అతిథి అధ్యాపకుల నియామకం.అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. మండల విద్యాశాఖ అధికారి అనిత దేవి.
మరిపెడ,జూన్ 24(నమస్తే న్యూస్).
మరిపెడలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో గత ఏడాది ప్రారంభించిన వృత్తి విద్యా ఇంటర్మీడియట్ కోర్సు - బహుళార్థక ఆరోగ్య కార్యకర్త కోర్సు బోధనకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నారు.ఇంగ్లీషు,నర్సింగ్ సబ్జెక్టుల బోధన కోసం ఇద్దరు అతిథి అధ్యాపకుల పోస్టులకు ప్రకటన విడుదల చేశారు.ఇంగ్లీషు బోధించేందుకు ఎంఏ ఇంగ్లీషు,బీఈడీలో ఇంగ్లీషు పద్ధతి,టెట్ అర్హత తప్పనిసరి.నర్సింగ్ బోధనకు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి.అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో కూడిన దరఖాస్తులను జూన్ 25 నుండి 27వ తేదీ వరకు మరిపెడ కేజీబీవీలో అందజేయాలి.ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి అనిత దేవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కోర్సు ద్వారా బాలికలకు వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని,గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఇది మంచి అవకాశమని అధికారులు పేర్కొన్నారు.

