Type Here to Get Search Results !

విత్తన మేళాను సందర్శిన జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర.

విత్తన మేళాను సందర్శిన జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర.




దంతాలపల్లి,జూన్ 24(నమస్తే న్యూస్)

దంతాలపల్లి మండలం కేంద్ర లో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు చేపట్టిన విత్తన మేళా లోని స్టాల్స్ ని నేడు జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర  మరియు ఇంచార్జి ఏ.డి.ఏ శ్రీదేవి   సందర్శించారు. ఈ సందర్భంగా డి.ఏ.ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం రోజులపాటు 23 జూన్ నుండి 30వ తారీకు వరకు రైతు వేదికల లో విత్తనమేళను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మేళా లో భాగంగా రైతు వేదికల్లో రైతులకు కావలసిన పెసర, మినుము,కంది మరియు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఏడు రకాల పరి విత్తనాలు వాటితో పాటుగా నానో యూరియా,నానో డీఏపీ మరియు కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలియజేయడం జరిగింది.ఎలినినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెట్ట పంటలు వేయాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ లో 7 రకాల వరి ధాన్యలను సూచించిందని, ఈ రకాలను మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ వరిస్తుందని తెలిపారు.అలాగే వ్యవసాయంలో యూరియా వాడకం తగ్గించాలని యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని రైతులు అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాహిని,ఏవో హర్షవర్ధన్ , విత్తన డీలర్లు మరియు రైతులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.