Type Here to Get Search Results !

రైతులకు నానో యూరియాతో అధిక ప్రయోజనం:ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

  • రైతులకు నానో యూరియాతో అధిక ప్రయోజనం.
  • యూరియా పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి.




నర్సింహులపేట, జూన్ 22 (నమస్తే న్యూస్)రైతులు సంప్రదాయ యూరియా వాడకాన్ని క్రమంగా తగ్గించి నానో యూరియా వినియోగానికి అలవాటు పడితే అధిక ప్రయోజనం పొందవచ్చని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు.సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) ఆధ్వర్యంలో రైతులకు యాప్ ద్వారా జరుగుతున్న యూరియా పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన, ప్రారంభంలో యాప్ వినియోగంలో కొంత ఇబ్బంది ఎదురైనా, తర్వాత యూరియా కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు పారదర్శకంగా అందుతాయని తెలిపారు.నానో యూరియా వినియోగం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని, భవిష్యత్తులో దీనిని మరింత విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సూచించిన ఆరు రకాల వరి సన్నాలను మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆ రకాల పంటలకు మాత్రమే బోనస్ లభించడమే కాకుండా, దిగుబడిని సులభంగా విక్రయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.మంగళవారం నుంచి రైతు వేదికల ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభమవుతుందని, రైతులకు పారదర్శకంగా విత్తనాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.