- 99 రోజుల ప్రగతి పాలనపై మున్సిపాలిటీ స్థాయి సమీక్ష.
- ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ హాజరు.
డోర్నకల్/మరిపెడ(జూన్ 04)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై మున్సిపాలిటీ స్థాయి సదస్సు గురువారం ఘనంగా నిర్వహించారు.ప్రజా పాలన ప్రగతి ప్రచారక కేంద్రం మరియు తెలంగాణ రైజింగ్ సంయుక్త ఆధ్వర్యంలో మరిపెడ పురపాలక సంఘం అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం జరిగింది.సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్-డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరాలని,ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.పారిశుధ్యం,తాగునీరు,వీధి దీపాలు,రోడ్ల మరమ్మతులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పురపాలక అధికారులు 99 రోజుల్లో చేపట్టిన పనులు,ఖర్చు చేసిన నిధులు,సాధించిన లక్ష్యాలపై నివేదిక సమర్పించారు.వార్డుల వారీగా పెండింగ్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించారు.ప్రజా పాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచేందుకు వార్డు సభలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.ఈ సదస్సు ద్వారా స్థానిక అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగిందని,పాలనలో పారదర్శకత పెరిగిందని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ నరేష్ రెడ్డి ,కృష్ణవేణి,మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్లు,వార్డు కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



