Type Here to Get Search Results !

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.

  • రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.
  • కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు.

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు


నర్సింహులపేట, జూన్ 19 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ,త్యాగాల కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి సామాన్య ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా దేశ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన జననాయకుడు రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు దసరా నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ ఖాన్, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు కాస యాకయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బాబురావు , రూపుల తండా సర్పంచ్ సేవియా నాయక్ ,రూట్ల తండా గ్రామ పార్టీ అధ్యక్షులు మేఘ్య బాబురావు ,మండల సమన్వయ కమిటీ చైర్మన్ అలవాల శ్రీనివాస్,జయపురం ఉపసర్పంచ్ మందుల వేణు, వివిధ గ్రామాల అధ్యక్షులు చుక్క వెంకన్న, గాడిపెళ్లి నాగముని గౌడ్, ముఖేష్,  రఘు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దూరు యాకయ్య, ధర్మారపు ప్రేమ్చంద్ , ఎర్ర రవి, లెక్కల సంపత్ రెడ్డి, కొంపల్లి యాకయ్య, వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నిమ్మల శ్రీనివాస్ యాదవ్, రమేష్ ,మెడీ శెట్టి యాకన్న , గుగులోత్ వీరన్న, వార్డు సభ్యులు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.