Type Here to Get Search Results !

మిషన్ భగీరథ కార్మికుల హక్కుల సాధనకు నూతన జిల్లా కమిటీ ఎన్నిక.

జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఆధ్వర్యంలో.
మిషన్ భగీరథ కార్మికుల హక్కుల సాధనకు నూతన జిల్లా కమిటీ ఎన్నిక.

డోర్నకల్/మరిపెడ(జూన్ 19)నమస్తే న్యూస్.

మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన లక్ష్యంగా సీఐటీయూ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గ్రామీణ ప్రాంతాలు,వాటర్ ప్లాంట్లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సంఘటితమై తమ హక్కుల పరిరక్షణ,ఉద్యోగ భద్రత,కనీస వేతనాల అమలు,కార్మిక సంక్షేమం కోసం యూనియన్‌లో చేరి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారని రాజమౌళి తెలిపారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ వివరాలు:




జిల్లా అధ్యక్షుడు అలువాల కృష్ణ,అబ్బాయిపాలెం జిల్లా ఉపాధ్యక్షుడు రాయల శ్రీను,ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్,ధర్మారపు సుధాకర్,పందుల రాజశేఖర్,బి.శ్రీను,మార్కం రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి శానం ఉపేందర్ సహాయ కార్యదర్శులు బానోత్ సోమ్లా,జి.వెంకన్న,సంతోష్,వంశీ,ఏళ్లబోయిన అశోక్,లాలు సైదులు కోశాధికారి చెన్నబోయిన వీరేందర్ గౌరవ సలహాదారులు చింతల యాకన్న,చెన్నబోయిన రవి.సోషల్ మీడియా ఇన్‌చార్జీలు...గంగరబోయిన రఘు,పైండ్ల రాధాకృష్ణ,ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.కార్మికులకు కనీస వేతనాలు,ఉద్యోగ భద్రత,ఈఎస్ఐ,పీఎఫ్ వంటి చట్టబద్ధ హక్కులు అమలు అయ్యేలా ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని,జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులందరినీ సంఘంలో చేర్చి బలోపేతం చేస్తామని వెల్లడించారు.నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా కార్మికులు నాయకులకు అభినందనలు తెలియజేసి,సంఘాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.