- భ్రమరాంబికా అమ్మవారి ఆలయానికి శ్రీకారం.
- అమ్మవారి ఆలయ నిర్మానానికి మున్సిపల్ చైర్ పర్సన్ విరాళం.
డోర్నకల్/మరిపెడ(జూన్ 04)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని గల ప్రసిద్ధి చెందిన శివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ భ్రమరాంభిక అమ్మవారి ఆలయ నిర్మాణానికి తలపెట్టి,ఆలయ నిర్మాణ పనులపై గురువారం ముఖ్య సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఈరోజు మరిపెడ మున్సిపల్ ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ నిర్మాణ ప్రణాళికలను వివరించారు.కమిటీ సభ్యుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఛైర్ పర్సన్,అమ్మవారి ఆలయ నిర్మాణానికి తన వంతు విరాళంగా.1,11,116/రూపాయలను విరాళంగా ప్రకటించారు.భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా నిర్మించాలని,నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆమె కమిటీ సభ్యులకు సూచించారు.ఆలయ నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇస్తూ,ఈ కార్యక్రమంతో(ఈ ఆలయ నిర్మాణంతో )మరిపెడ పట్టణం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని ఆమె ఆకాంక్షించారు.దైవ దర్శనాలతో మనుసు తెలికౌతుందని,అలాగే యువతలో భక్తి భావాలు పెంపోంధించేలా భక్తి కార్యక్రమాలు,భజన కార్యక్రమాలు నిర్వహించాలని,మన పిల్లలను వారంలో ఒక రోజైన ఆధ్యాత్మికత గురించి,బగవధ్యానంపై,ఆలయాల దర్శనం చేపియ్యాలని,అలాగే భగవద్గీత పిల్లలతో చదివిస్తే సమాజంలో ఎలా నడుచుకోవాలి,ఎవర్ని ఎలా గౌరవించాలనే జ్ఞానం భగద్గీత చదివితే అర్ధం ఔతుందని అన్నారు.చైర్మన్ ప్రకటించిన విరాళానికి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.త్వరలోనే ఆలయ నిర్మానానికి భూమిపూజ చేసి నిర్మాణ పనులు చేపడుతామని ఆలయ కమిటి సభ్యులు తెలియచేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంధసిరి భిక్షపతి,ఆలయ నిర్మాణ కమిటీ బాధ్యులు వుప్పల రవి,గర్రెపల్లి కాంతారావు,దారం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

