Type Here to Get Search Results !

మరిపెడ మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన. మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

  • మరిపెడ మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన. 
  • మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.



డోర్నకల్/మరిపెడ(జూన్ 04)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం,మరిపెడ మండలంలోని భూక్య తండా(ఉల్లేపల్లి)గ్రామంలో మంగళవారం రోజు మాలోత్ శారద,మాలోత్ నీల మృతి చెందిన నేపథ్యంలో,నేడు వారి కుటుంబాలను మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి,వారికి చెరోక 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ,అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అర్ధాంతరంగా వారు మరణించడం ఆ కుటుంబాలకు తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల బీఆర్ఎస్ నాయకులు ఉల్లేపల్లి సర్పంచ్ నవిలే కలమ్మ వెంకన్న,పెదబోయిన శ్రీనివాస్,భూక్య రామ్మూర్తి నాయక్,బొమ్మకంటి వెంకట్ గౌడ్,కూరకుల ఉపేంద్ర,రాసమల్ల దాసు,మోర రమేష్,పెదగొల్ల వీరన్న,గుగులోత్ సురేష్,బాణోత్ సందీప్,భూక్య రాము కుమార్,  బిక్షపతి,థౌర్య,సక్కు,బౌసింగ్,కిషన్,లక్‌పతి,గోపాల్,దాస్య,రవి,సుఖ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.