Type Here to Get Search Results !

చింతపల్లిగూడ గ్రామంలో తాగునీటి పైపుల లీకేజీ...పలు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు.

  • చింతపల్లిగూడ గ్రామంలో తాగునీటి పైపుల లీకేజీ.
  • పలు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు.
  • తక్షణమే మరమత్తులు చేపట్టాలని ప్రజల ఆందోళన.






ఇబ్రహీంపట్నం,జూన్ 25(నమస్తే న్యూస్)

చింతపల్లిగూడ గ్రామంలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ పైపులు,అక్కడక్కడ పలు ప్రాంతాల్లో   గత కొన్ని రోజులుగా లీకేజీ అవుతుండటంతో విలువైన నీరు వృథాగా పోతోంది. పైపుల నుంచి నిరంతరం నీరు  లేకవుతుండటంతో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తారు రోడ్డు పై తీవ్రంగా ఏర్పడిన గుంతలతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.లీకేజీ సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టి, దెబ్బతిన్న రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.









Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.