- మరిపెడలో జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం.
- ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయడమే లక్ష్యం.
- పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహాకరించాలి:
- మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ రవి
డోర్నకల్/మరిపెడ,జూన్ 25(నమస్తే న్యూస్).
మరిపెడ మండల కేంద్రంలో ఈ ఆదివారం,జూన్ 28న జరిగే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గుగులోతు రవి ఆధ్వర్యంలో మండలంలోని అంగన్‌వాడీ టీచర్లు,ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి మరిపెడ ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లమ్మ ముఖ్య అతిథిగా హాజరై,సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.మండలంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా గ్రామాల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె చెప్పారు.ఈ నెల(జూన్) 28 ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.పోలియో రహిత సమాజ నిర్మాణానికై ఇప్పుడు పుట్టిన పిల్లలు 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికి ప్రతి ఒక్కరు భాధ్యతగా చిన్నారుల భవిష్యత్తుకై పోలియో చుక్కలు వేయించాలి.మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు,ప్రభుత్వ పాఠశాలలు,ఆరోగ్య కేంద్రాలు,బస్టాండు మరియు ప్రధాన కూడళ్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.ఆదివారం చుక్కలు వేయించుకోని పిల్లల కోసం సోమ,మంగళవారాల్లో సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు.వలస కూలీల పిల్లలు,ఇటుక బట్టీల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులు ఆదేశించారు.ఈ అవగాహన కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు ఆచార్యులు,లక్ష్మి కుమారి,రాజ్యలక్ష్మి మరియు మండలంలోని అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి,పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

