గాయపడిన చిన్నారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నర్సింహులపేట, జూన్ 17(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు కర్నే శ్రీకాంత్ కుమార్తె ప్రమాదవశాత్తు వేడి నీరు ఒంటిపై పడటంతో గాయపడిన విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆమెను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జి వీరస్వామి గౌడ్, గడుదుల కొమురెల్లి, గంట మహేష్, కొమ్ము మధుకర్, చెలమల్ల ఉపేందర్, టేకుల ప్రవీణ్ రెడ్డి, గంట రాములు, చిత్తలూరి దుర్గయ్య, చెలమల్ల పాపయ్య తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.



