Type Here to Get Search Results !

నూతన ఎంపీడీవో రాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ సర్పంచులు.

  • నూతన ఎంపీడీవో రాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ సర్పంచులు



నర్సింహులపేట, జూన్ 17(నమస్తే న్యూస్)


మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జి. రాంప్రసాద్‌రావును మండలంలోని పలువురు బీఆర్ఎస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన ఎంపీడీవోకు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

సర్పంచులు మాట్లాడుతూ, మండల అభివృద్ధిలో ఎంపీడీవో రాంప్రసాద్‌రావు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కౌసల్యాదేవిపల్లి సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, వంతడుపుల సర్పంచ్ మాలోత్ బాలు నాయక్, రామన్నగూడెం సర్పంచ్ దారెల్లి రాధికా రమేష్, పక్కిరా తండా సర్పంచ్ కైలా రవి నాయక్, బక్క తండా సర్పంచ్ గుగులోత్ నరేష్ నాయక్, ఉపసర్పంచ్ సురేష్ నాయక్, గ్యామ తండా సర్పంచ్ భూక్య వినోద్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.