ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు.
కేసముద్రం, జూన్ 6 (నమస్తే న్యూస్):మాజీ కేంద్ర మంత్రివర్యులు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను శనివారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ బలరాం నాయక్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి, పీసీసీ సభ్యుడు దశ్రు నాయక్, మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న, బండారు దయాకర్, నీలం దుర్గేష్ ముదిరాజ్, అంబటి మహేందర్ రెడ్డి, ఎండి అయూబ్ ఖాన్, పోలేపాక నాగరాజు, కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్, కనుకుల రాంబాబు, మాజీ సర్పంచ్ సాంబయ్య, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమరయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

