మూలమర్రి తండ లో సర్పంచ్ భూక్యా జానకి ఆధ్వర్యంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక.
మరిపెడ(జూన్ 06)నమస్తే న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం మూలమర్రి తండ గ్రామ పంచాయితీలో సర్పంచ్ భూక్యా జానకి నేతృత్వంలో విజయవంతంగా సాగుతోంది.99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పన,పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.శనివారం సర్పంచ్ భూక్యా జానకి అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.జీపీ కార్యదర్శితో కలిసి సర్పంచ్ గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ప్రజలు తమ వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.ప్రజా సమస్యలను వినతులను స్వీకరించారు.పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం,సీసీ రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషిచేస్తామని,గ్రామసభల ద్వారా ప్రతి సమస్యను గుర్తించి పారదర్శకంగా పరిష్కరిస్తామని సర్పంచ్ భూక్యా జానకి తెలిపారు.జాబితా సవరణ ప్రక్రియపై కూడా సర్పంచ్ అవగాహన కల్పించారు.

