- 43 రైతువేదికల ద్వారా యూరియా సరఫరా.
- యూరియా యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలి.
- పకడ్బందీగా యూరియా సరఫరా చేయాలి.
- యూరియా తప్పు దోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలి.
- ఎరువుల సరఫరా పై సమీక్ష లో వ్యవసాయ శాఖ అధికారులకు అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం ఆదేశాలు.
మహబూబాబాద్, జూన్18(నమస్తే న్యూస్):గురువారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల సరఫరా పై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షకు ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ పురుషోత్తం హాజరై వ్యవసాయ శాఖ ఏవోలు మరియు ఏఈఓ లకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత సీజన్లో యూరియా సరఫరా లో జరిగిన ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా పకడ్బందీగా యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఉన్న 67 సొసైటీలతోపాటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 43 రైతువేదికలను ఎంపిక చేసి వాటి ద్వారా కూడా యూరియా సరఫరా చేయబోతున్నామని తెలిపారు.యూరియా యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని ఏఈఓ లను ఆదేశించారు.ముందుగానే మండలాల వారీగా యూరియా ఎంత అవసరమో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రణాళిక బద్దంగా యూరియా సరఫరా చేయాలని అధికారులను కోరారు.ఎప్పటికప్పుడు యూరియా నిలవలను పర్యవేక్షించుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరా చేయాలని అన్నారు. గ్రామాలలో నిగ్రాని సమితి లను యాక్టివేట్ చేసి యూరియా తప్పు దోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సొసైటీ సీఈవోలు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని యూరియా సరఫరాలో ఇబ్బందుల తలెత్తకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయచంద్ర జిల్లా సహకార అధికారి విజయ కుమారి ఏడీఏలు శ్రీనివాసరావు శ్రీదేవి అన్ని మండలాల ఏవోలు మరియు సొసైటీ సీఈవోలు పాల్గొన్నారు.

