Type Here to Get Search Results !

మాదక ద్రవ్యాల నివారణకు సమరశంకాన్ని పూరిస్తున్న పోలీసులు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
నమస్తే న్యూస్ ప్రత్యేక కథనం



మరిపెడ,జూన్ 26(నమస్తే న్యూస్)తెల్లవారుజామున ఐదు గంటలు.చీకటి ఇంకా పూర్తిగా విడలేదు.ఊరు గాఢ నిద్రలో ఉన్నది,ఖాకి డ్రస్సుల్లో పోలీసు అధికారులు డ్యూటీ చేసే విషయంలో రేయనక,పగలనక సమ సమాజ నిర్మాణం కొరకు,ఖాకీ దుస్తుల్లో కొందరు అధికారులు మాత్రం అప్పటికే తమ కర్తవ్యంలో మునిగిపోయారు.కర్తవ్య నిర్వాహణలో నిమగ్నమై అందరూ నిద్రపోతున్న వారు మాత్రం డ్యూటీని భాధ్యతగా చేస్తూ,సమాజం భాధ్యత వారి భుజాలామీద మోస్తూ,ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని సమాజంలో చెడును కడిగేషేటందుకు కృషి చేస్తున్న పోలీసు అధికారులు.

ఈరోజు మామూలు రోజు కాదు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. "మాదకద్రవ్యాల వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుంది" అనే గొప్ప సంకల్పంతో పోలీసు శాఖ విస్తృత కార్యక్రమాలు చేపట్టింది.

ఒకవైపు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు."మత్తుకు దూరంగా ఉండండి" అంటూ యువత చేతుల్లో ప్లకార్డులు పట్టించి వీధుల్లో నడిపిస్తున్నారు.మరోవైపు ముఖ్య కూడళ్ళలో,బస్టాండుల్లో,రైల్వే స్టేషన్లలో పోస్టర్లు అంటిస్తూ,కరపత్రాలు పంచుతూ "ఆరోగ్యకరమైన సమాజం కోసం వ్యసనాలను వదిలేద్దాం" అని ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు.

కేవలం ప్రచారంతోనే సరిపెట్టలేదు.ప్రచారంతో పాటే పని కూడా మొదలుపెట్టారు.ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యువత ఎక్కువగా గుమ్మిగూడే పాన్ షాపులు,టీ సెంటర్లు,చిన్న హోటళ్ళు,బస్టాండ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అనుమానం ఉన్న ప్రతి మూలనా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాలు అక్రమంగా అమ్ముతున్న వారిని,రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.

ఒకచోట తనిఖీలు చేస్తున్న ఒక అధికారి ఒక యువకుడి భుజంపై చెయ్యి వేసి,"చూడు నాయనా,ఈ మత్తు అనే ఊబిలో ఒక్కసారి కాలు పెడితే జీవితం నాశనం అవుతుంది.నీ కలలు కరిగిపోతాయి,నీ కుటుంబం కన్నీళ్ళ పాలవుతుంది.ఆటలు ఆడు,పుస్తకాలు చదువు,నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.నీ తల్లి తండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు వారి ఆశయాలు అడి ఆశలు చేయకు,వారి ఆశలు ఆశయాలు సాధించేటందుకు,మీ భవిష్యత్తును భాగుచేసుకునేటందుకు ఈరోజే మంచి నిర్ణయం తీసుకొని,వ్యాపారమో,ఉద్యోగమో ఏదో ఒకటి మీ కుటుంబ పెద్దల నిర్ణయం తీసుకొని మొదలు పెట్టు,కానీ ఈ మత్తు అనే చెడుకు దూరంగా ఉండు గట్టిగా వద్దు అని చెప్పు" అని ప్రేమతో భరోసా ఇచ్చాడు.

ఆ ఖాకీ మాటల్లో చట్టం కఠినత్వంతో పాటు ఒక తండ్రి ప్రేమ,ఒక అన్న బాధ్యత కనిపించాయి.కేవలం కేసులు నమోదు చేయడం,శిక్షించడం వారి లక్ష్యం కాదు.ఒక తరాన్ని,ఒక భవిష్యత్తును మత్తు అనే మహమ్మారి నుండి కాపాడాలనే పెద్ద తపన వారిది.ఈరోజు పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్చివేసిన మత్తు పదార్థాల కుప్పపైన,విరిగిన సూదుల పైన'జీవితాన్ని ఎంచుకోండి'అనే నీలి రంగు రిబ్బను రెపరెపలాడుతోంది.అది సమాజానికి ఇస్తున్న సందేశం ఒక్కటే

"మత్తును వదిలేద్దాం, ముద్దుగా బతికేద్దాం"



కారంపురి వెంకటేశ్వర్లు నేత.

మహబూబాబాద్.

మరిపెడ బంగ్లా.

7893556455.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.