మరిపెడ,జూన్ 23(నమస్తే న్యూస్).మరిపెడ పట్టణ కేంద్రంలోని బాలవికాస కేంద్రంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,సమాజంలో వితంతువులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.వితంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఒంటరి మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా సమాజం వారికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,ప్రముఖులు గంధసిరి ఉపేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు,మహిళా సంఘాల నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.వితంతువుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలవికాస కేంద్రం నిర్వాహకులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.